తరుచుగా అడిగే ప్రశ్నలు
అసలు క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి?
కొంత మంది వ్యక్తులు లేదా కొన్ని సంస్థల నుంచి చిన్న చిన్న మొత్తాల్లో డబ్బు సమీకరించి, ఏదైనా ఒక ప్రాజెక్ట్, వ్యాపారం కోసం ఉపయోగించడాన్ని క్రౌడ్ ఫండింగ్ అంటారు. ఈ క్రౌడ్ ఫండింగ్ సాధారణంగా ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా చేయబడుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న ఈ క్రౌడ్ ఫండింగ్ పద్దతి ద్వారా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాం.
అంటే మరి దీనికి నిర్మాత లేనట్టా?
అలా అని కాదు. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు వెంకటేష్ మహా తన బ్యానర్ ద్వారా నిర్వహిస్తారు.
మనం సాధారణంగా అనుకుంటున్నట్టు ఒక నిర్మాత బాధ్యత కేవలం డబ్బు సేకరించి చిత్ర నిర్మాణం లో పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు. ఒక నిర్మాత చిత్ర ప్రారంభ దశ అంటే రచన స్థాయి నుంచి అది పూర్తి చేసి థియేటర్లలో విడుదల అయ్యేదాకా ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తారు. దీనికితోడు, ఒక నిర్మాత ఆర్ధిక వనరులు సమీకరించడం, ఒక నాణ్యమైన క్రియేటివ్ టీమ్ ఏర్పాటు చేసుకోవడం, బడ్జెట్ చూసుకోవటం అంతకుమించి ప్రతి దశలోనూ ఆ చిత్రానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడటం కూడా చిత్ర నిర్మాత భాద్యత. నిర్మాతలు కథని ఎంచుకోవడం, క్యాస్టింగ్, మార్కెటింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ వంటి అతి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తన పాత్ర ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, నిర్మాత అనే వ్యక్తి ఒక చిత్రానికి వెన్నుముకగా ఉంటూ, ఆర్ధిక మరియు ప్రాక్టికల్ అంశాలని బ్యాలన్స్ చేస్తూ మొత్తం చిత్ర నిర్మాణ భాద్యతను ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రాజెక్టు ని విజయవంతం చేస్తారు.
ఇది విరాళమా?
“మర్మాణువు” లాభాన్ని ఉద్దేశించి చేస్తున్న ప్రాజెక్ట్ కాదు, కాబట్టి మీరు అందించిన డబ్బుని విరాళం లాగ కాకుండా ఆర్ధిక సమీకరణ లాగ పరిగణిస్తున్నాము.
పన్ను మినహాయింపు ఉంటుందా?
ఉండదు. ఇది పూర్తిగా విరాళం కాకపోవడం వల్ల మీరు అందించిన ఆర్ధిక ఫండింగ్ పన్ను మినహాయింపు ఉండదు. మా చిత్రానికి చేస్తున్న తోడ్పాటే తప్ప స్వచ్చందంగా చేస్తున్న దానం కాకపోవడం వల్ల, మీకు ఆదాయ పన్ను సెక్షన్ 80G వర్తించదు.
ఫండింగ్ అందించిన డబ్బు తిరిగి వస్తుందా?
“రివార్డ్స్” లో వివరించినట్టుగా ప్రతీ ఫండింగ్ కి ప్రత్యేక ప్రతిఫలాలు అందుతాయి. పది లక్షలు పైగా అందించిన ఫండింగ్ కి మాత్రం నగదు రూపేణా మీకు తిరిగి ప్రతిఫలం అందుతుంది. ప్రతీ విభాగానికి ఒక్కో విధంగా మీకు ప్రతిఫలాలు అందుతాయి అని గమనించగలరు. పది లక్షలు కంటే తక్కువ ఆర్ధిక చేయూత అందించిన వారికి మా సంస్థ నుంచి నగదు రూపంలో ప్రతిఫలం అందదు.
ఫండింగ్ ని ఉపసంహరించుకోగలనా?
ఉపసంహరణ కుదరదు. ఒక్కసారి మీరు అందించిన ఆర్ధిక ఫండింగ్ మీకు తిరిగి ఇవ్వబడదు. ఈ నియమం చిత్ర నిర్మాణ ప్రతి దశలో అంటే ప్రొడక్షన్ దశ, ప్రీ ప్రొడక్షన్ దశ, పోస్ట్ ప్రొడక్షన్ దశ అలాగే చిత్రం విడుదల అయిన తరువాత కూడా ఫండింగ్ అందించిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. పదిలక్షలు లేదా అంతకుమించి ఫండింగ్ అందించిన వారికి మాత్రమే నగదు రూపంలో అందించబడుతుంది అలాగే మీరు అందించిన ఆర్ధిక ఫండింగ్ ప్రాజెక్టు పూర్తికాకుండా తీసుకోలేరు.
అందించిన ఫండింగ్ కి రసీదు లభిస్తుందా?
మీ డబ్బు కంపెనీ అకౌంట్ లోకి చేరిన వెంటనే, మీ పేరుతో పూర్తి వివరాలు రెఫరెన్సు నంబరు, తేదీ మరియు సమయం మొదలయిన వివరాలతో సహా రసీదు మీరు అందించిన ఈమెయిల్ కి పంపబడుతుంది.
పాన్ వివరాలు ఎందుకు అందించాలి?
మీరు అందించిన పాన్ వివరాలు కేవలం లీగల్ పద్ధతుల కొరకు మాత్రమే వినియోగించబడుతుంది. మీ ఈ వివరాలు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లవు అని నిర్వాహకులుగా మేము హామీ ఇస్తున్నాము. మీరు అందించిన అడ్రస్ ఇతర వివరాలు కూడా కేవలం మీకు అందబోయే ప్రతిఫలాలు అందించేందుకు మాత్రమే వినియోగించబడుతుంది.
ప్రతిఫలాలు నాకెప్పుడు అందుతాయి?
మీకు అందబోయే ప్రతిఫలాలు వాటి వాటి సమయానుకూలంగా మీకు అందుతాయి. ఉదాహరణకు - "డైరెక్టర్ సంతకం కలిగిన 1st లుక్ డౌన్ లోడబుల్ సినిమా పోస్టర్" మీకు చిత్ర ప్రారంభ దశలో లభిస్తుంది, "మిస్టరీ ప్యాక్" మరియు "ప్రైవేట్ స్క్రీనింగ్ కి పాసులు" మీకు చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో అందుతాయి.
ప్రతిఫలాలు నాకెలా అందుతాయి?
ఏవైతే డిజిటల్ గా అందించబడతాయో అవి మీకు వెబ్ సైట్ లేదా మీ ఈ-మెయిల్ ద్వారా మీకు అందించబడతాయి. మిగిలినవి మీకు డెలివరీ ద్వారా లేదా మీకు ఆహ్వానం అందిన ఏదైనా కార్యక్రమంలో స్వయంగా అందించబడతాయి.
మీరు ఇవ్వని స్లాట్ లో ఎలా ఫండింగ్ అందించగలను. ఉదా: 35,000/- రూపాయల సహాకారం అందించాలంటే ఎలా ?
మీలో ఎవరైనా ఇక్కడలేని స్లాట్లో ఫండింగ్ అందించాలనుకుంటే ఒకటికంటే ఎక్కువ స్లాట్లు ఎంపిక చేసుకోవచ్చు. చేసుకొని ఫండింగ్ అందించవచ్చు. ఉదాహరణకు - ఒకవేళ మీరు 35,000/- రూపాయలు సహాకారం అందించాలనుకుంటే మీరు ఒక 25,000 స్లాట్స్ తో పాటు ఇంకొక 10,000/- స్లాట్ ఎంపిక చేసుకోవచ్చు. మీరు ఈ పద్దతిలో ఫండింగ్ అందిస్తే మీకు 25,000 స్లాట్ ప్రతిఫలాల తో పాటు 10,000/- స్లాట్ ప్రతిఫలాలు కూడా అందుతాయి.
పొరపాటున డబ్బు సహకరించా, నేను దాన్ని క్యాన్సల్/మార్చుకోవచ్చా?
ఒకసారి డబ్బు అందచేసాక తిరిగి తీసుకోలేరు. దయచేసి మీరు పేమెంట్ చేసేటప్పుడు ఒకటికి రొండుసార్లు మీరు అందించాలనుకున్న మొత్తాన్ని చెక్ చేసుకొని అందించగలరు. ఏదైనా పొరపాటు జరిగితే అది మీ వైపు నుంచి అయినదిగా పరిగణించబడుతుంది, ఆ పొరపాటుకు నిర్వాహకులకు ఎటువంటి బాధ్యత ఉండదు.
ఒకేసారి ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది సహాకారం అందించవచ్చా?
ఒక స్లాట్లో ఒకరే ఫండింగ్ అందించగలరు, ఒకవేళ మీరు ఎక్కువ మంది కలిసి ఫండింగ్ అందించాలి అనుకుంటే మీరందరు కలిసి ఒక వ్యక్తి లాగ ఏర్పడి మీకు నచ్చిన స్లాట్ ని ఎంపిక చేసుకోగలరు. కానీ, అక్కడ ఆధార్ మరియు పాన్ వివరాలు ఎవరివి అయితే అందించారో వాళ్ళని మాత్రమే ఫండింగ్ అందించిన వ్యక్తి గా గుర్తించబడుతుంది.
వాయిదా పద్దతిలో ఫండింగ్ అందించొచ్చా?
వాయిదా పద్ధతుల్లో ఫండింగ్ స్వీకరించబడదు.
అందించిన ప్రతిఫలాలని నేను తిరిగి అమ్ముకోవచ్చా?
ప్రతిఫలాన్ని మరొకరి పేరుతో బదలాయింపు కుదరదు. ఎవరైనా అమ్మడం జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
నాకు ప్రతిఫలాల్లో భాగంగా లభించిన మర్మాణువు ప్రత్యేక ప్రదర్శనల టిక్కెట్లని నా బదులు ఇంకొకళ్ళకి ఇవ్వొచ్చా?
ఫండింగ్ చేసిన వారికి ప్రతిఫలంగా లభించిన టిక్కెట్లను వారి స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కానీ, ఎవరైతే మర్మాణువు ప్రదర్శన కి వస్తున్నారో వారి వద్ద ఫండర్ కి అందించబడిన ప్రత్యేక కోడ్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే, ఫండర్ తన టికెట్స్ ని ఎవరికీ అమ్ముకోవడానికి మాత్రం వీలు లేదు. ఎవరైనా అమ్మడం జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
పోస్టు డెలివరీ ఖర్చులు మేము చెల్లించాలా?
మీ ప్రతిఫలాలు డెలివరీ ఖర్చులు పూర్తిగా నిర్వాహకులు భరిస్తారు.
విదేశాల్లో ఉన్న సహాయకులకు RED CARPET వంటి కార్యక్రమాలకు ప్రత్యామ్న్యాయంగా ఎటువంటివి ఉంటాయి?
విదేశాలనుంచి ఫండింగ్ చేసినవారికి online ఇంటెరెక్షన్స్ మరియు ప్రముఖ దేశాల్లో వేరే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుకై ప్లాన్ చేస్తాము. మరింత సమాచారానికై రివార్డ్స్ పట్టిక చూడగలరు.
నేను విదేశాల్లో నివసిస్తుంటాను. ఇక్కడి కరెన్సీలో CROWD FUNDING అందించొచ్చా?
అలాంటి సౌకర్యం లేదు. మీలో ఎవరైనా విదేశాల్లో ఉంటె మీరు ఫండింగ్ అందించలేరు. మీ ఆసక్తికి కృతజ్ఞతలు కానీ ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. మేము భారతీయ payments మాత్రమే accept చేస్తాము. దయచేసి వాటిని ఒకసారి పరిశీలంచగలరు.
Intellectual property కి సంబంధించిన అధికారాలు మాకు అందుతాయా?
మీరు ఎంత మొత్తం ఫండింగ్ అందించినా కూడా, ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి intellectual property రైట్స్ మీకు ఉండవు. అవి పూర్తిగా చిత్ర దర్శక రచయితకు మాత్రమే సొంతం.
నాకు ఈ చిత్రంలో ఏదైనా నచ్చకపోయినా లేక ఏమైనా
అంశాలు నా మనోభావాల్ని నొప్పించినా, నేను ఫండింగ్ చేసిన డబ్బులు నాకు తిరిగి చెల్లించబడతాయా?
చెల్లించబడవు. ఈ చిత్ర కథ, నేపథ్యం మరియు కథనాల ఆధారంగా ఏ వ్యక్తికీ వారి డబ్బులను తిరిగి చెల్లించడం జరగదు.
ఈ చిత్రానికి సంబంధించిన తాజా వివరాలు నాకు ఎప్పటికప్పుడు అందించబడతాయా?
తప్పకుండా. ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య వివరాలు సమయానుసారంగా మా వెబ్ సైట్స్ ద్వారా అందించబడతాయి.
ఫండింగ్ అందించినందుకు గాను నాకేమైనా క్రెడిట్స్ లభిస్తాయా?
500 నుంచి లక్ష వరకు ఫండింగ్ అందించిన ప్రతి ఒక్కరికి చిత్రం ఎండ్ క్రెడిట్స్ లో మీ పేరు వేయబడుతుంది. పది లక్షలు నుంచి కోటి వరకు ఫండింగ్ అందించిన వారికి చిత్రం ఓపెనింగ్ క్రెడిట్స్ లో మీ పేరు వేయబడుతుంది.
ఈ చిత్రం పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుంది?
మా అంచనా ప్రకారం ఈ చిత్రం పూర్తి కావడానికి 18 నెలల సమయం పడుతుంది. ఒక చిత్రం నిర్మించే సమయం లో వచ్చేటువంటి ఊహించని పరిణామాలు, సినీ పరిశ్రమలో వచ్చే సాంకేతిక సవాళ్లు ఈ చిత్ర నిర్మాణాన్ని, ఫలితాల్ని ప్రభావితం చేయగలవు. అందువలన, ఈ చిత్ర నిర్వాహకులు ఈ చిత్ర నిర్మాణం ఫలితాలపై ఎటువంటి హామీలను అందజేయడం లేదు.
వేరేవాళ్లతో జత కట్టి ఎక్కువ మొత్తంలో ఉన్న స్లాట్ లో ఉన్న బహుమతులు పొందవచ్చా?
అది సాధ్యం కాదు. ఒక్కసారి ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ ఒక స్లాట్ లో ఫండింగ్ అందించాక దానికి సంబంధించిన నగదు మరియు బహుమతులు మాత్రమే అందుతాయి. ఎవరైనా వేరే వాళ్ళతో జత కట్టే ఉదేశ్యం ఉంటె అది ఫండింగ్ అందించడానికి ముందే వారి తో సంప్రదించగలరు.